బెంగాల్‌లో రైలు సేవల పునరుద్దరణ..10కి చేరిన మృతుల సంఖ్య

పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురి స్టేషన్‌కు సమీపంలోని రంగపాణి వద్ద రెండు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం అనంతరం సహాయక చర్యలు వేగంగా చేపట్టిన అధికారులు రైలు సేవలను తిరిగి పునరుద్దరించారు.

Update: 2024-06-18 16:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురి స్టేషన్‌కు సమీపంలోని రంగపాణి వద్ద రెండు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం అనంతరం సహాయక చర్యలు వేగంగా చేపట్టిన అధికారులు రైలు సేవలను తిరిగి పునరుద్దరించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈ లైన్‌లో రైళ్లు నడిచాయని కతిహార్ డివిజనల్ రైల్వే మేనేజర్ కుమార్ తెలిపారు. ట్రాక్, ఇతర మరమ్మతులను పూర్తి చేశామని చెప్పారు. విద్యుత్ ట్రాక్షన్ స్తంభాలు దెబ్బతినగా సరిచేసినట్టు వెల్లడించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాద స్థలాన్ని సందర్శించి ఇది ఈశాన్య ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ప్రధాన మార్గం కాబట్టి, వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు సత్వర చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనలో మరొకరు మరణించినట్టు రైల్వే శాఖ తెలిపింది. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరుకుంది.

Similar News