రైల్వే ట్రాక్ ఫిష్ ప్లేట్ల తొలగింపు..తప్పిన ప్రమాదం

గుజరాత్ లో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు యూపీ రైల్వై లైన్ మార్గంలో రైలును పట్టాలు తప్పించేందుకు దుశ్చర్యకు పాల్పడ్డారు

Update: 2024-09-21 07:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ లో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు యూపీ రైల్వై లైన్ మార్గంలో రైలును పట్టాలు తప్పించేందుకు దుశ్చర్యకు పాల్పడ్డారు. కిమ్ రైల్వే స్టేషన్ ట్రాక్ నుంచి ఫిష్ ప్లేట్లు, కొన్ని కీలను తెరిచి, సమీపంలోని అదే ట్రాక్‌పై ఉంచడం ద్వారా రైలు ప్రమాదానికి ప్రయత్నించారు. వెస్ట్రన్ రైల్వే, వడోదర డివిజన్ లో చోటుచేసుకున్న ఘటనతో బిలాస్‌పూర్‌ రోడ్‌-రుద్రాపూర్‌ సిటీ మధ్య ప్రయాణిస్తున్న గుజరాత్‌ మెయిల్‌కు పెను ప్రమాదం తప్పింది. దుండగుల దుశ్చర్యను ముందే గుర్తించడంతో రైలును నిలిపి వేసి, ట్రాక్ పై ఉన్న ఆ మెటీరియల్ ను తొలగించి రైళ్ళ రాకపోకలను పునరుద్దరించారు.

అంతకుముందు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్లో దుండగుు టెలిఫోన్ వైర్లు వేయడానికి ఉపయోగించే పాత ఏడు మీటర్ల పొడవైన ఇనుప స్తంభాన్ని రైల్వే ట్రాక్ పై పెట్టారు. అయితే డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ రైలు డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. రాంపూర్ కు 43 కిలోమీటర్ల దూరంలోని రుద్రాపూర్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రుద్రపూర్ సిటీ సెక్షన్ రైల్వే ఇంజనీర్ రాజేంద్ర కుమార్ ఫిర్యాదు మేరకు రాంపూర్ ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదైంది. ఆగస్టు 24న ఫరూక్ బాద్ లో కాస్గంజ్-ఫరూఖాబాద్ రైల్వే ట్రాక్ లోని భటాసా రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పై కలప దుంగను ఉంచారు. ప్యాసింజర్ రైలు దానిని ఢీకొనడంతో ఆగిపోయింది. ఈ వరుస సంఘటనలతో సిబ్బందితో రైల్వే పోలీసులు అప్రమత్తతను పెంచారు. 


Similar News