సీబీడీటీ ఛైర్మన్‌గా రవి అగర్వాల్

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్‌గా రవి అగర్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

Update: 2024-06-29 18:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్‌గా రవి అగర్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. రవి అగర్వాల్‌ 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. 2023 జూలై నుంచి సీబీడీటీ (అడ్మినిస్ట్రేషన్) సభ్యుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు. జూలై 1న బాధ్యతలు రవి అగర్వాల్‌ స్వీకరించనున్నారు.

సెప్టెంబర్ 30తో రవి అగర్వాల్ పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 2025 జూన్ 30 వరకు రవి అగర్వాల్ పదవీకాలాన్ని పొడిగించే అవకాశం ఉంది. 2022 సంవత్సరం జూన్ నుంచి సీబీడీటీ ఛైర్మన్‌గా నితిన్ గుప్తా ఉన్నారు. ఆయన 1986 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. 2023 సంవత్సరం సెప్టెంబర్ 30తోనే నితిన్ పదవీ కాలం ముగిసినా.. 2024 జూన్ 30 వరకూ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది.ఇప్పుడు ఆయన స్థానంలో రవి అగర్వాల్‌ను ప్రభుత్వం నియమించింది.

Similar News