ఆర్మీ వైస్ చీఫ్‌గా సుబ్రమణి..బాధ్యతలు స్వీకరణ

ఆర్మీ వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి చేపట్టడానికి ముందు సుబ్రమణి లక్నోలోని సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా ఉన్నారు.

Update: 2024-07-01 18:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్మీ వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి చేపట్టడానికి ముందు సుబ్రమణి లక్నోలోని సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా ఉన్నారు. ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్న ఉపేంద్ర ద్వివేది చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో సుబ్రమణిని ప్రభుత్వం నియమించింది. కాగా, 1985లో గర్వాల్ రైఫిల్స్ లోకి ప్రవేశించిన సుబ్రమణి.. 37ఏళ్ల పాటు విశిష్టమైన సేవలు అందించారు. పశ్చిమ, ఉత్తర సరిహద్దులలో ఆయనకు మంచి అవగాహన ఉందని సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు సుబ్రమణి స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ అనింద్య సేన్‌గుప్తా సెంట్రల్ ఆర్మీ కమాండర్‌గా నియమితులయ్యారు. ఆయన అంతకుముందు ఉదంపూర్ కేంద్రంగా ఉన్న నార్తర్న్ కమాండ్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్నారు.

Similar News