‘వైస్ ఛాన్స్‌లర్’ ఇకపై ‘కులగురు’

దిశ, నేషనల్ బ్యూరో : ‘వైస్‌ ఛాన్స్‌లర్’ పదవి పేరు మారిపోయింది. ఇకపై ఆ పదవిలో ఉన్నవారిని ‘కులగురు’ అని పిలుస్తారు.

Update: 2024-07-01 19:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘వైస్‌ ఛాన్స్‌లర్’ పదవి పేరు మారిపోయింది. ఇకపై ఆ పదవిలో ఉన్నవారిని ‘కులగురు’ అని పిలుస్తారు. ఈ కీలక నిర్ణయాన్ని మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. ఈ నిర్ణయం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో విద్యార్థుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. ఈ నెలలో గురుపౌర్ణమి సందర్భంగా దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‘‘కులపతి (వైస్ ఛాన్స్‌లర్) అనే పదం అప్పుడప్పుడు ఇబ్బందులకు దారితీస్తోంది. ఆ పదవిలో ఉన్న మహిళల జీవిత భాగస్వాములను ‘కులపతి’ భర్తలుగా పేర్కొనడం వారికి ఇబ్బందికరంగా అనిపిస్తోంది’’ అని సీఎం యాదవ్‌ చెప్పారు. మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ హయాంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా మోహన్ యాదవ్ పనిచేశారు. ఆ టైంలోనే వీసీ హోదాను ‘కులగురు’గా మార్చాలని ఆయన ప్రతిపాదించారు. అయితే అందుకు నాటి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు సీఎంగా మోహనే ఉండటంతో ఆ ప్రపోజల్ వెంటనే అమల్లోకి వచ్చేసింది.


Similar News