సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల..14,430 మంది క్వాలిఫై

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్-2024 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో చెక్ చేసుకోవచ్చు.

Update: 2024-07-01 17:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్-2024 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో చెక్ చేసుకోవచ్చు.14,430 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు క్వాలిఫై అయినట్టు తెలుస్తోంది. అర్హత సాధించిన వారి హాల్ టెకెట్ నంబర్లను యూపీఎస్పీ వెబ్ సైట్‌లో పొందుపర్చారు. అయితే కట్-ఆఫ్ మార్కులు తుది ఫలితాల ప్రకటన తర్వాత వెల్లడించనున్నారు.కాగా, జూన్ 16న దేశ వ్యాప్తంగా 80 నగరాల్లో ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 13.4లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ సెప్టెంబర్‌ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది సివిల్స ద్వారా1,056 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

Similar News