ఖలిస్తాన్ వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌కు పెరోల్ మంజూరు

శుక్రవారం(జూలై 5) ఆయన స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణం చేయనున్నారు

Update: 2024-07-03 16:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జైలు నుంచే ఎంపీగా గెలిచిన ఖలిస్తాన్ వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌కు ప్రమాణ స్వీకారం చేసేందుకు నాలుగు రోజుల పెరోల్ లభించింది. శుక్రవారం(జూలై 5) ఆయన స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణం చేయనున్నారు. ఈ విషయాన్ని ఇండిపెండెంట్ ఎంపీ సరభ్‌జిత్ సింగ్ ఖల్సా ధృవీకరించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అమృతపాల్ సింగ్ బుధవారం స్పీకర్‌ను కలిసి అనుమతి తీసుకున్నారు. లోక్‌సభలో కాదని, స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణం చేయడానికి ఓం బిర్లా అనుమతిచ్చినట్టు సరభ్‌జిత్ సింగ్ పేర్కొన్నారు. జూలై 5 నుంచి నాలుగు రోజుల పార్టు పెరోల్ ఆమోదాన్ని దిబ్రూఘర్ జైలు సూపరింటెండెంట్‌కు అమృత్‌సర్ జిల్లా కమిషనర్ తెలియజేశారు. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద అమృతపాల్ సింగ్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన తరపున కుటుంబసభ్యులు, వివిధ సంఘాలు నిర్వహించాయి. ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి 1.97 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 


Similar News