Ranveer Allahbadia: క్షమాపణలు కోరిన యూట్యూబర్ రణ్‌వీర్ అలహబాదియా
తల్లిదండ్రులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన 31 ఏళ్ల యూట్యూబర్ రణ్‌వీర్ అలహబాదియా (Ranveer Allahbadia) క్షమాపణ (Sorry) లు చెప్పాడు.

దిశ, నేషనల్ బ్యూరో: తల్లిదండ్రులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన 31 ఏళ్ల యూట్యూబర్ రణ్‌వీర్ అలహబాదియా (Ranveer Allahbadia) క్షమాపణ (Sorry) లు చెప్పాడు. యూట్యూబ్ ఛానెల్ బీర్ బైసెప్స్‌కు చెందిన రణ్‌వీర్ అలహబాదియా.. ఈ మేరకు సారీ చెబుతూ రికార్డు చేసిన ఒక వీడియోను తన సోషల్ మీడియా(Social Media) అకౌంట్ లో పోస్టు చేశాడు. తల్లిదండ్రుల గురించి తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని, తప్పుగా మాట్లాడినందుకు తనను క్షమించాలని ఆ వీడియోలో కోరాడు. అయితే, జోక్ గా కూడా అలాంటి కామెంట్లు చేయవద్దని.. తనకు హాస్యం చేయరాదని చెప్పాడు. జోక్ చేద్దామని తప్పుగా మాట్లాడానని అందుకు క్షమాపణలు కోరుతున్నాని అన్ని అన్నాడు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంను బాధ్యతాయుతంగా వాడుకుంటానని, ఇంకెప్పుడూ ఇలాంటి కామెంట్స్ చేయనని చెప్పుకొచ్చాడు. “నా నిర్ణయంలో తప్పు ఉంది. ఆ లోపం నా వైపు నుంచే ఉంది. పాడ్‌కాస్ట్‌ను అన్ని వయసుల వారు చూస్తారు. బాధ్యతలను తేలికగా తీసుకునే వ్యక్తిగా నేను ఉండకూడదనుకుంటున్నా. నేను కుటుంబాన్ని, కుటుంబవ్యవస్థను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేసేవాడ్ని కాదు" అని చెప్పుకొచ్చాడు.
అసలేం జరిగిందంటే?
రణ్‌వీర్ అలహబాదియా.. కమెడియన్ సమయ్ రైనా నిర్వహించిన ‘ఇండియాస్ గాట్ లేటెంట్ షో (India’s got latent show)’ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంటెంట్ క్రియేటర్లు ఆశిష్ చంచ్లానీ, జస్ప్రీత్ సింగ్, అపూర్వ ముఖిజాలతోపాటు షోలో పాల్గొన్న ఆయన ఆ షోలో పాల్గొన్నాడు. ‘తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనడాన్ని నువ్వు జీవితాంతం చూస్తావా..? లేదంటే ఒకసారి చూస్తే ఆపై చూడకుండా ఉంటావా..?’ అని ఒక కంటెస్టెంట్‌ను అతడు ప్రశ్నించాడు. కాగా.. ఈ ప్రశ్నపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తింది. నెటిజన్‌లు అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై ముంబై పోలీస్ కమిషనర్‌కు, మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. తల్లిదండ్రుల వ్యక్తిగత సంబంధాల గురించి ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం నీచంగా ఉందని నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీంతో, ఆ కామెంట్లకు క్షమాపణలు చెబుతూ రణ్‌వీర్ వీడియో రిలీజ్ చేశాడు.