కేజ్రీవాల్ కు నైతికత లేదు : రాజ్ నాథ్ సింగ్
ఢిల్లీ(Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal)తన పదవికి రాజీనామా చేయడం పట్ల కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath singh) స్పందించారు.
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ(Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal)తన పదవికి రాజీనామా చేయడం పట్ల కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath singh) స్పందించారు. కేజ్రీవాల్ కు నైతికత లేదన్నారు. అదే గనుక ఉంటే మధ్యం కుంభకోణంలో ఆరోపణలు వచ్చిన రోజునే రాజీనామా చేసేవారని అన్నారు. జైల్లో ఉండి వచ్చి, కోర్టు ఆంక్షలు విధించడం వల్ల రాజీనామా డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. అప్పుడే రాజీనామా చేసి ప్రజా న్యాయస్థానాన్ని ఎదుర్కొని ఉండాల్సింది, ఇపుడు ప్రజల్లో ఆయనపై విశ్వాసం పోయిందన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ గెలవడం ఖాయం అని రాజ్ నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా... ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి... ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. జైలు నుండి బయటకి వచ్చిన కొద్ది గంటల్లోనే తను సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ విషయం మీద ఆప్(AAP) నేతలతో కూలంకషంగా చర్చించి తాత్కాలిక సీఎంగా ఆప్ మంత్రి అతిశీ(Athishi)ని ఎన్నుకున్నారు. ఆప్ లో జరిగిన తాజా పరిణామంపై స్పందించిన రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.