వయనాడ్ MP సీటు వదులుకోవడంపై రాహుల్ గాంధీ ఎమోషనల్ కామెంట్స్
దేశ రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎట్టకేలకు తెరదించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వయనాడ్, రాయ్
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎట్టకేలకు తెరదించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలీ లోక్ సభ స్థానాల నుండి పోటీ చేసి గెలిచిన రాహుల్.. ఏదో ఒక సీటును వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వయనాడ్ లోక్ సభ స్థానాన్ని వదులుకుని.. రాయ్ బరేలీ నుండి కంటిన్యూ కావాలని రాహుల్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో తన సిట్టింగ్ స్థానమైనా వయనాడ్ సీటును వదులుకోవడంపై రాహుల్ గాంధీ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వయనాడ్ సీటును వదులుకోవడం అంతా సులభమైన నిర్ణయం కాదన్నారు.
ఇక్కడ ప్రజలకు ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరుస్తామని మాట ఇస్తున్నానని అన్నారు. వయనాడ్‌కు ఇక నుండి ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఉంటారని, తన సోదరి ప్రియాంకతో పాటు ఇక్కడి ప్రజలకు తాను కూడా ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని మాటిచ్చారు. వయనాడ్, రాయబరేలి ప్రాంతాలతో నా బంధం ప్రత్యేకమైందని, రెండు ప్రాంతాల ప్రజలు ఎంతో ప్రేమను చూపారని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. రాయ్ బరేలీతో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని, అందుకే అక్కడి నుండి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నానని రాహుల్ క్లారిటీ ఇచ్చారు. రాహుల్ రాజీనామాతో వయనాడ్‌కు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరుఫున రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారు.