ఎంపీని తోసేసిన రాహుల్ గాంధీ.. బీజేపీ సీనియర్ ఎంపీ తలకు గాయం

పార్లమెంట్ సమావేశాల వేళ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

Update: 2024-12-19 05:49 GMT

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ సమావేశాల వేళ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఓ ఎంపీని తీసేయడం(Pushed)తో ఆ ఎంపీ బీజేపీ సీనియర్ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి(MP Pratap Chandra Sarangi)పై పడడంతో కింద పడిపోయాడు. దీంతో ఎంపీ సారంగి తలకు గాయం(head injury) కావడంతో హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా గాయంతో ఆస్పత్రికి వెళ్తున్న ఎంపీ సారంగిని.. ఏం జరిగిందని మీడియా ప్రశ్నించగా.. "ఎంపీ రాహుల్(Rahul Gandhi) గాంధీ నెట్టడంతో నేను కింద పడ్డాను.. నేను మెట్ల దగ్గర నిలబడి ఉండగా రాహుల్ గాంధీ వచ్చి నా పై పడిన ఎంపీని తోసేశాడని.. దీంతో తాను కింద పడిపోయానని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తీరుకు వ్యతిరేకంగా ఈ రోజు ఉదయం నుంచి పార్లమెంట్ ఆవరణలో బీజేపీ నేతలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క లోక్ సభలో హోమ్ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. ఇండియా కూటమి సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Similar News