రాహుల్ గాంధీ గూండాయిజాని ఇదే నిదర్శనం: కేంద్ర మంత్రి చౌహాన్
పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి, రాహుల్ గాంధీ ఎంపీలను నెట్టివేయడం తో బీజేపీ ఎంపీ ప్రతాప్ సింగ్ సారంగి తలకి గాయం అయింది.
దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి, రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎంపీలను నెట్టివేయడం తో బీజేపీ ఎంపీ(BJP MP) ప్రతాప్ సింగ్ సారంగి(Pratap Singh Sarangi) తలకి గాయం అయింది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్(Union Minister Shivraj Singh Chouhan).. గాయపడిన ఎంపీని ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'పార్లమెంటరీ చరిత్రలో ఇదో బ్లాక్ డే(Black day).. డెకోరమ్ ఛిన్నాభిన్నమైంది(The decorum was shattered). ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ పార్టీల గూండాయిజానికి(hooliganism) ఇంతకంటే ఉదాహరణ మరొకటి లేదు.. ఇటువంటి ప్రవర్తన భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. హర్యానా, మహారాష్ట్రలను కోల్పోతే వారు తమ నిరాశను పార్లమెంట్‌లో ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వాళ్లు ప్రజాస్వామ్యంలో నడవడికను అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సూచించారు.