Thalapathy Vijay: అమిత్ షా వ్యాఖ్యలపై దళపతి విజయ్ కౌంటర్
పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలు, అంబేడ్కర్ వాదులు నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ (టీవీకే) చీఫ్ (Thalapathy Vijay) విజయ్ స్పందించారు. అమిత్ షా వ్యాఖ్యలపై తాజాగా ఎక్స్ వేదికగా దళపతి విజయ్ కౌంటర్ ఇచ్చారు. కొంత మందికి అంబేడ్కర్ పేరు నచ్చదన్నారు. ఆయన పేరు అంటే వారికి ఎలర్జీ అని తెలిపారు. ఆయనను అవమానించడానికి హించబోమంటూ కామెంట్స్ చేశారు. ఆయన భారత పౌరులందరికీ స్వాతంత్ర్య స్పూర్తిని రగించిలిన సాటిలేని రాజకీయ మేధావి అని పేర్కొన్నారు.
(Ambedkar) అంబేడ్కర్.. అంబేడ్కర్.. అంబేడ్కర్.. అంటూ ఆయన పేరు మన హృదయాలతోపాటు పెదవులపై ఆనందంతో జపిస్తూనే ఉంటామని హీరో విజయ్ వివరించారు. దీంతో, ఆయన (BJP) బీజేపీనే టార్గెట్ చేసి ఇలా కామెంట్స్ చేశారని పలువురు చెబుతున్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కాగా, దళపతి విజయ్ తన రాజకీయ పార్టీ (TVK) టీవీకే పార్టీ మొదటి ర్యాలీ సందర్భంగా అంబేడ్కర్ తన పార్టీ సైద్దాంతిక గురువు అని చెప్పిన విషయం తెలిసిందే.