FIR Filed: తోపులాటలో బీజేపీ ఎంపీకి గాయం.. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ (BR Ambedkar)పై కేంద్ర హోంమత్రి హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ఆవరణలో ఎన్డీఏ (NDA), ఇండియా కూటమి (India Alliance) పోటాపోటీ నిరసనలకు దారి తీశాయి.

Update: 2024-12-19 08:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ (BR Ambedkar)పై కేంద్ర హోంమత్రి హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ఆవరణలో ఎన్డీఏ (NDA), ఇండియా కూటమి (India Alliance) పోటాపోటీ నిరసనలకు దారి తీశాయి. ఈ క్రమంలో విపక్ష రాహుల్ గాంధీ (Rahul Gandhi), బీజేపీ ఎంపీ ప్రతాప్ సింగ్ సారంగి (MP Prathap Singh Sarangi)ని తోసివేయడంతో ఆయనకు తలకు తీవ్ర గాయం అయింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది, బీజేపీ ఎంపీలు ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి Ram Manohar Lohiya Hospital)కి తరలించారు.

గాయపడిన మరో ఎంపీ ముకేష్ రాజ్‌పుత్ (MP Mukesh Rajput) అదే ఆసుపత్రిలో ఐసీయూ (ICU)లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే తోపులాట ఘటనపై తాజాగా బీజేపీ (BJP) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తొపులాట సృష్టించారంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై బీజేపీ (BJP) ఎంపీలు అనురాగ్ ఠాకూర్ (Anurag Takur), బన్సూరి స్వరాజ్ (Bansuri Swaraj) పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

Tags:    

Similar News