Jagdeep Dhankhar : జగ్‌దీప్ దన్‌ఖడ్‌పై అభిశంసన నోటీసు తిరస్కరణ..!
జగ్‌దీప్ దన్‌ఖడ్‌పై అభిశంసన నోటీసు తిరస్కరణ..!
దిశ, నేషనల్ బ్యూరో: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ దన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన నోటీసు గురువారం తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ ఈ మేరకు అభిశంసన నోటీసును తిరస్కరించినట్లు సమాచారం. ఇది ప్రతిపక్షాల అనుచిత ప్రయత్నమని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవడంతో పాటు ఈ నోటీసుల్లో చట్టబద్ధత లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ సంస్థలను, ప్రస్తుత ఉపరాష్ట్రపతిని కించపరిచేలా అభిశంసన నోటీసులు ఉన్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ ప్రవేశపెట్టిన రూలింగ్ డిప్యూటీ చైర్మన్ తెలిపారు. ఇదిలా ఉండగా 60 మంది ప్రతిపక్ష సభ్యులు ఇటీవల ధన్‌ఖడ్‌ను పదవి నుంచి తొలగించాలని నోటీసులపై డిసెంబర్ 10న సంతకం చేశారు. ఈ నోటీసుల్లో వాస్తవ ప్రతిపాదన లేదని కేవలం ప్రచారం పొందడమే లక్ష్యం కనిపించిందని వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతిని ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో నోటీసుల్లో అనేక వాదనలు ఉన్నాయని డిప్యూటీ చైర్మన్ ఈ సందర్భంగా తెలిపారు.