ఇతరులను నిందించడమే మోడీ పని: ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్
అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విమర్శలు గుప్పించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ, బీజేపీ నేతలు ఎప్పుడు దేశం యొక్క భవిష్యత్ గురించి మాట్లాడటం లేదని.. తమ వైఫల్యాలకు ఇప్పటికీ గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులతో మాట్లాడిన రాహుల్ గాంధీ ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై స్పందిస్తూ.. కాంగ్రెస్ హయాంలో జరిగిన ప్రమాదాలు తనకు గుర్తు ఉన్నాయని.. అయితే వాటికి బ్రిటిషర్లే కారణం అని నాడు కాంగ్రెస్ అనలేదన్నారు.
నాటి ఘటనకు బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే శాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నానని ప్రకటించారని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం ఏదైనా ఘటన జరిగితే దానికి సాకులు వెతుకుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ భారత్ అనే కారును నడిపే ప్రయత్నం చేస్తున్నప్పటీ ఆయన ముందుకు చూడకుండా కారును వెనుక అద్దంలో చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. దాంతో కారు ముందుకు పోకుండా ఎందుకు ప్రమాదాలకు గురవుతుందో ఆయనకే అర్థం కావడం విమర్శించారు.