ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తాం కానీ.. స్పీకర్ పదవిపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
లోక్సభ స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పదవికి పోటీ చేసే ఎన్డీఏ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని రాహుల్ ప్రకటించారు.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్సభ స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పదవికి పోటీ చేసే ఎన్డీఏ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని రాహుల్ ప్రకటించారు. అయితే, డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా.. బీజేపీతో చర్చలు జరిపిన తర్వాత రాహుల్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయంపై తీసుకువచ్చేందుకు బీజేపీ చర్చలు జరిపింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రంగంలో దిగారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల ఇండియా కూటమిని ఒప్పించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఇతర నేతలతో చర్చలు జరుపారు. అయితే, ఇలాంటి టైంలోనే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.