Rahul Gandhi: హర్యానాలో బీజేపీ విజయం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంచలన ట్వీట్‌

ఏకంగా ఎగ్జిట్ పోల్స్‌ (Exit Polls)ను తలకిందులు చేస్తూ హర్యానా (Haryana)లో మరోసారి బీజేపీ (BJP) హ్యట్రిక్ విజయం సాధించింది.

Update: 2024-10-09 07:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏకంగా ఎగ్జిట్ పోల్స్‌ (Exit Polls)ను తలకిందులు చేస్తూ హర్యానా (Haryana)లో మరోసారి బీజేపీ (BJP) హ్యట్రిక్ విజయం సాధించింది. తాజాగా, జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులు పక్కాగా ప్లాన్ అమలు చేసి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ (BJP)ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని.. ఈ క్రమంలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోబోతోందని ఆయా మీడియా సంస్థలు (Media Organizations), ఎగ్జిట్ పోల్స్‌ (Exit Polls)లో కూడా స్పష్టమైంది. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఊహించని విధంగా బీజేపీ (BJP) హర్యానా (Haryana)లో ఘన విజయాన్ని నమోదు చేసింది.

రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ (BJP) 48, కాంగ్రెస్ (Congress) 37, ఇతరులు (Others) 5 సీట్లలో విజయం సాధించారు. అయితే, తాజాగా ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా ఎన్నికల ఫలితాలపై త్వరలోనే సమగ్ర విశ్లేషణ చేపడుతామని అన్నారు. కౌంటింగ్ సందర్భంగా పలు అసెంబ్లీ స్థానాల నుంచి తమకు పెద్ద ఎత్తున ఫిర్యాదు అందాయని పేర్కొన్నారు. ఆ ఫిర్యాదులను వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతం పోరాడుతూనే ఉంటుందని రాహుల్‌ గాంధీ ట్వీట్ చేశారు. 


Similar News