సామాన్య ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్

పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించిన ఎన్డీయే ప్రభుత్వం.. కీలక నిర్ణయాలను తీసుకుంటుంది.

Update: 2024-10-09 10:56 GMT

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించిన ఎన్డీయే ప్రభుత్వం.. కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ క్రమంలో నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో జరుగుతున్న కేంద్ర కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొనగా.. సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలకు ఆసరాగా నిలుస్తోన్న “ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని” పొడిగిస్తూ.. కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కేబినెట్ మంత్రులు ఆమోదం తెలిపారు. దీంతో 2028 సంవత్సరం వరకు పేదలకు ఉచిత రేషన్ అందించనున్నారు. దీనికి మొత్తం 17,082 కోట్ల రూపాలయను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Minister Ashwini Vaishnav) మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలను వెల్లడించారు. అందులో గుజరాత్ లో నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ ఏర్పాటు, లోథల్ వద్ద ఈ హెరిటేజ్ కాంప్లెక్స్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రూ.4,406 కోట్ల వ్యయంతో సరిహద్దు రోడ్లను అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Similar News