హర్యానా ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

హర్యానా ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-09 13:04 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ భారీ విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలకు ముందు.. బీజేపీ ఓడిపోతుందని ఎగ్జిట్ ఫోల్స్ అంచనా వేయగా ప్రజల తీర్పు మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. దీంతో అన్ని సంస్థలు, రాజకీయ పార్టీల అంచనాలు తప్పడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నాయి. ఇదిలా ఉంటే హర్యానా రాష్ట్రంలో బీజేపీ గతంలో కంటే 8 స్థానాలు అధికంగా గెలచుకుని వరుసగా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది. కాగా హర్యానా ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో బీజేపీ విజయంపై తన ట్విట్టర్ లో ట్వీట్ చేసిన జగన్.. ఇలా రాసుకొచ్చారు. మరో ఎన్నికల ఫలితం విస్మయానికి గురి చేస్తోంది. హర్యానా ఫలితాలు ఏపీలో మాదిరిగానే ఉన్నాయి. బ్యాలెట్ ఎన్నికలతో ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలే.. బ్యాలెట్ పేపర్లను వాడుతున్నాయి. బ్యాలెట్ పేపర్ ఓటర్లు విశ్వాసం పెంచుతుందని సీఎం తన ట్వీట్ లో రాసుకొచ్చారు. దీంతో మరోసారి దేశంలో బ్యాలెట్ పేపర్ల ఎన్నికల ప్రముఖ్యతను సీఎం జగన్ తెరమీదకు తీసుకొచ్చారు.


Similar News