AP New Medical Colleges: ఏపీ నూతన మెడికల్ కాలేజీలకు వీజీఎఫ్.. నీతి ఆయోగ్ హామీ
నీతి అయోగ్ సభ్యుడితో మంత్రి సత్యకుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీలో.. ఏపీలో నూతనంగా నిర్మితమవుతున్న 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వీజీఎఫ్ అందిస్తామని నీతిఅయోగ్ హామీ ఇచ్చింది.
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా నిర్మిస్తున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు (AP New Medical Colleges) వీజీఎఫ్ (Viability Gap Funding) ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. నీతిఅయోగ్ (Niti Aayog) సభ్యుడు వినోద్ పాల్ తో మంత్రి సత్యకుమార్ (Minister Satyakumar) వీజీఎఫ్ పై చర్చించగా.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు మంత్రి వెల్లడించారు. రెండు మూడు దశల్లో 12 మెడికల్ కాలేజీలకు వీజీఎఫ్ ఇచ్చేలా హామీ ఇచ్చినట్లు తెలిపారు. వైద్యకళాశాలల నిర్వహణకు ఏడాదికి రూ.200 కోట్లు ఖర్చవుతుండగా.. పాడేరు, పిడుగురాళ్ల వైద్య కళాశాలల నిర్వహణకు కేంద్రం ఇచ్చే ఫండ్స్ ను ఉపయోగిస్తామని తెలిపారు.
వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటి ?
వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే.. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (PPP) ప్రాజెక్ట్స్ లో ఆర్థికంగా లాభదాయకం కాని వాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ రూపంలో అందించే ఆర్థిక సహాయం. ఈ పథకం ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. 2004లో పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్నర్ షిప్ ల కింద జరిగే ప్రాజెక్టులకు మద్దతుగా ఈ పథకాన్ని ప్రారంభించారు.