Leopard Attack: మహారాష్ట్రలో దారుణం.. మహిళపై దాడిచేసిన చిరుత.. ఆ తర్వాత దూరంగా లాక్కెళ్లి..

మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. పొలంలో పనిచేస్తున్న మహిళపై చిరుత దాడి చేసి.. 100 అడుగులవరకూ ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

Update: 2024-10-09 12:38 GMT

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర (Maharashtra)లో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళపై దాడిచేసిన చిరుత (Leopard Attack) ఆమెను 100 అడుగుల దూరం లాక్కెళ్లి.. తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పుణె (Pune) సమీపంలోని పింప్రి-పెంధార్ గ్రామంలో సుజాత ధేరే అనే మహిళ చెరకు పొలాల చుట్టూ ఉన్న సోయాబీన్ పొలంలో పనిచేసుకుంటోంది. అప్పటికే ఆహారం కోసం మాటువేసిన చిరుత.. మహిళపైకి అమాంతం దూకి..100 అడుగుల దూరం వరకూ లాక్కెళ్లింది. చిరుతదాడిలో మహిళకు తీవ్రగాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడున్న కొందరు పోలీసులకు సమాచారమివ్వగా.. అటవీశాఖ అధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టంకు పంపారు. పింప్రి-పెంధార్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరుతలను బంధించేందుకు 40 బోనులు, 50 కెమెరాలను అమర్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అలాగే చిరుతల దాడిపై పరిసర ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకూ జున్నార్ అటవీ డివిజన్ (Junnar Forest Division) సమీపంలో చిరుతదాడిలో మొత్తం 7 గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవలే యూపీలో చిరుతదాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. 

Tags:    

Similar News