రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చిల్లర కష్టాలకు చెల్లు

రైలు ప్రయాణాలు ఇక మరింత సులభం కానున్నాయి.

Update: 2024-08-14 14:25 GMT

దిశ, వెబ్ డెస్క్ : రైలు ప్రయాణాలు ఇక మరింత సులభం కానున్నాయి. రైలు వచ్చే సమయానికి టికెట్స్ కోసం కౌంటర్లలో సరిపడా చిల్లర డబ్బులు చేతిలో పట్టుకొని నిలబడే శ్రమ తప్పిస్తోంది రైల్వే శాఖ. ఇకపై అన్ని రైల్వే స్టేషన్లలో క్యూఆర్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీని ద్వారా అటు ప్రయాణికులకు, ఇటు కౌంటర్లలో చిల్లర కష్టాలు తీరనున్నాయి. మొదట ప్రధాన స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టగా అది విజయవంతం అయింది. ఇపుడు అన్ని రైల్వే స్టేషన్లలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని తీసుకు వస్తున్నారు. ఇకపై స్టేషన్లలో జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. ప్రయాణికుడికి సంబంధించిన వివరాలు కంప్యూటర్లోకి ఎక్కించాక, కౌంటర్ వద్దనున్న ప్రత్యేక డివైజ్ లో క్యూఆర్ ప్రత్యక్షం అవుతుంది. దాన్ని యూపీఐ ఆప్స్ ఉపయోగించి చెల్లింపులు చేసిన వెంటనే టికెట్ అందిస్తారు. ఈ కొత్త పద్దతిలో కీలకంగా వ్యవహరించిన కమర్షియల్ మరియు టెక్నికల్ సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మెచ్చుకున్నారు.    


Similar News