పాములు పట్టేవాళ్లు రెడీ.. 14న తెరుచుకోనున్న రత్న భాండాగారం

దిశ, నేషనల్ బ్యూరో : ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించిన రత్న భాండాగారాన్ని జులై 14న తెరవనున్నారు.

Update: 2024-07-11 18:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించిన రత్న భాండాగారాన్ని జులై 14న తెరవనున్నారు. నిధులు, నిక్షేపాలకు నెలవుగా భావిస్తున్న ఈ రహస్య గదిని తెరిచే క్రమంలో అధికార వర్గాలు కొన్ని ముందుజాగ్రత్త ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. నిధులు, నిక్షేపాలు ఉన్నచోట పాములు ఉంటాయని చెబుతారు. ఒకవేళ ఈ ప్రాచీన రత్న భాండాగారంలోనూ పాములుంటే లోపలికి వెళ్లే వారికి రిస్కే.

అందుకే రత్న భాండాగారాన్ని తెరిచే టైంలో పాములు పట్టేవాళ్లు, ఓ వైద్యుల టీమ్‌ను సిద్ధం ఉంచే దిశగా ఏర్పాట్లు చేయనున్నారు. దీనిపై సంబంధిత విభాగాలకు ఇప్పటికే సమాచారాన్ని అందించామని జగన్నాథ్‌ టెంపుల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారి ఒకరు వెల్లడించారు. పూరీ జగన్నాథుడి విలువైన ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి ఈ రహస్య గదిలో భద్రపరిచారు. 1978 సంవత్సరం తర్వాత దాన్ని తెరవలేదు. కొత్తగా రాష్ట్రంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం నిర్ణయంతో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ భాండాగారాన్ని తెరవనున్నారు.


Similar News