PSLV-C60: నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న PSLV-C60.. కొనసాగుతోన్న కౌంట్‌డౌన్

ఇస్రో (ISRO) అమ్ములపొది నుంచి మరో రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

Update: 2024-12-30 04:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇస్రో (ISRO) అమ్ములపొది నుంచి మరో రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. పీఎస్ఎల్‌‌వీ సీ60 (PSLV C60) ప్రయోగానికి సమయం ఆసన్నమవుతోంది. నెల్లూరు (Nellore) జిల్లా శ్రీహరి కోట (Srihari Kota)లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (Sathish Dhawan Space Center)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ సీ60 (PSLV C60)కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ మేరకు వాహక నౌక అటాచ్‌మెంట్ పూర్తయిన వెంటనే టెక్నికల్ పరీక్షలను శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఆ పరీక్షలు పూర్తయ్యాక రాకెట్ లాంఛింగ్‌‌ను చేయవచ్చని ధృవీకరించారు.

కాగా, PSLV C20 ప్రయోగానికి ఆదివారం రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్ఎల్వీ సీ60 (PSLV C60) నిర్ణీత కక్ష్యలోకి దూసుకెళ్లనుంది. SpaDeX వంటి కార్యక్రమాలతో అంతరిక్ష టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ఇస్రో (ISRO) ప్రయత్నిస్తోంది. ఇది ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో పెరుగుతున్న భారత్ (India) పాత్రను విశ్వవ్యాప్తం చేయనుంది. ఈ రాకెట్ ద్వారా SDX01 (ఛేజర్) , SDX02 (టార్గెట్) అనే రెండు ఉపగ్రహాలను ఇస్రో రోదసిలోకి పంపనుంది. ఒక్కొక్కటి సుమారు 220 కిలోల బరువు ఉంటుంది. ఉపగ్రహాలను 470 కి.మీ ఎత్తులో వేరు వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టనున్నారు. 

Tags:    

Similar News