Encounter: ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌ (Chhattigsarh) బస్తర్‌ ప్రాంతంలో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణ్‌పూర్‌- దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ఎదురుకాల్పులు జరిగాయి.

Update: 2025-01-05 04:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌ (Chhattigsarh) బస్తర్‌ ప్రాంతంలో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణ్‌పూర్‌- దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ఎదురుకాల్పులు జరిగాయి. దక్షిణ అబుజ్‌మాద్‌లోని అటవీప్రాంతంలో శనివారం రాత్రి డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (DRG), సీఆర్పీఎఫ్‌(CRPF) బలగాలు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు (Maoists) కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) హెడ్ కానిస్టేబుల్ సన్ను కరమ్ మరణించాడు. ఘటనాస్థలి నుంచి నలుగురు మావోయిస్టుల మృతదేహాలు, ఏకే-47 రైఫిల్(AK-47), సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (SLR) సహా పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

గతేడాది 200 మందికిపైగా మావోలు మృతి

ఇకపోతే, 2024లో ఛత్తీస్‌గఢ్‌లో 200 మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. హతమైన 219 మంది మావోయిస్టుల్లో 217 మంది బస్తర్ ప్రాంతానికి చెందినవారే. 800 మంది మావోయిస్టులు అరెస్టు కాగా.. 802 మంది లొంగిపోయారు. 2024లో మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిగిన పోరులో 18 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, 65 మంది పౌరులు చనిపోయారు. మార్చి 2026 నాటికి మావోలు లేకుండా చేస్తామని గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) హామీ ఇచ్చారు.

Tags:    

Similar News