Cobra Viral Video : కాలనాగు కంట తడి పెట్టించింది..వైరల్ గా వీడియో!

విషంతో బుసలు కొట్టె కాలనాగు(Cobra) తన సహచర నాగు మరణంతో తన ప్రేమను చాటుతూ మనుషులను సైతం కంటతడి పెట్టించిన ఆరుదైన ఘటన వీడియో వైరల్ (Viral Video) గా మారింది.

Update: 2025-01-05 08:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : విషంతో బుసలు కొట్టె కాలనాగు(Cobra) తన సహచర నాగు మరణంతో తన ప్రేమను చాటుతూ మనుషులను సైతం కంటతడి పెట్టించిన ఆరుదైన ఘటన వీడియో వైరల్ (Viral Video) గా మారింది. మధ్యప్రదేశ్ శివపురి జిల్లాలో మైదాన ప్రాంతంలో భూమి చదును పనులను చేస్తున్న జేసీబీ క్రింద పడిన ఓ విషనాగు ప్రాణాలొదిలింది. చనిపోయిన పాము (Dead Snake) వద్ధకు వచ్చిన మరో నాగు పడగ విప్పి ఆ పాము మృతదేహాన్ని చూస్తు బాధను వ్యక్తం చేసినట్లుగా కనిపించింది. సాధారణంగా ఇలాంటి ఘటనలు జంతువులు, కాకులు, ఇతర పక్షులు, కోతుల్లో చూస్తుంటాం.

మరణించిన తన సహచర పాము పట్ల తన ప్రేమను..అది చనిపోయిందన్న బాధను ఆ పాము వ్యక్తం చేసిన తీరును చూసిన స్థానికులు అయ్యో అని.. విషనాగుల బంధాన్ని తలుచుకుని కంట తడి పెట్టారు. ప్రేమకు మనుషులైన..జంతువులైన..విషనాగులైన ఒక్కటేనని ఈ ఘటన చాటింది. ఒక పాము చనిపోతే మరో పాము దగ్గరికి వచ్చి ఇలా గంటపాటు గమనిస్తూ ఉండిపోవడాన్ని అంతా ఆసక్తిగా గమనించారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందుకు సంబంధించిన పాముల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:    

Similar News