Nagpur rescue centre: మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ వల్ల మూడు పులులు, చిరుత మృతి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ రెస్క్యూ సెంటర్ లో నాలుగు వన్యప్రాణులు చనిపోయాయి. చిరుత సహా మూడు పులులు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయాయి.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ రెస్క్యూ సెంటర్ లో నాలుగు వన్యప్రాణులు చనిపోయాయి. చిరుత సహా మూడు పులులు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయాయి. గోరెవాడ రెస్క్యూ సెంటర్(Gorewada Rescue Centre)లో మూడు పులులు, ఒక చిరుత వ్యాధికారక ఏవియన్ ఫ్లూ హెచ్5 ఎన్ 1 (avian flu H5N1) వైరస్‌తో చనిపోయాయి. డిసెంబర్ 2024లో వన్యప్రాణుల మరణాల తర్వాత మహారాష్ట్ర వ్యాప్తంగా అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. బర్డ్ ఫ్లూ సోకిన వన్యప్రాణులను చంద్రపూర్ నుంచి గోరెవాడకు తరలించారు.
మూడు పులులు మృతి
అయితే, డిసెంబర్ 20న ఒక పులి చనిపోగా, డిసెంబర్ 23న మరో రెండు చనిపోయాయి. దీంతో, వాటి మరణాల తర్వాత శాంపిల్స్‌ను భోపాల్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NISHAD)కి టెస్టింగ్ కోసం పంపారు. జనవరి 1న ల్యాబ్ ఫలితాలు వచ్చాయి. బర్డ్ ఫ్లూ వల్ల జంతువులు చనిపోయాయని తేలింది. అయితే, రెస్క్యూ సెంటర్ లోని 26 చిరుతలు, 12 పులులకు పరీక్షలు నిర్వహించగా అవి ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బర్డ్ ఫ్లూ సోకిన ఆహారం లేదా పచ్చి మాంసం తినడం వల్ల చిరుతలకు ఆ వైరస్ సోకినట్లు నిపుణులు భావిస్తున్నారు.