Coldplay: కోల్డ్ ప్లే కాన్సర్ట్ నిర్వాహకులకు నోటీసులు.. ఎందుకంటే?
కోల్డ్ ప్లే(Coldplay) కాన్సర్ట్ నిర్వాహకులకు అహ్మదాబాద్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సింగర్ క్రిస్ మార్టిన్(singer Chris Martin), కోల్డ్ ప్లే కాన్సర్ట్ నిర్వాహకులకు నోటీసులిచ్చింది.
దిశ, నేషనల్ బ్యూరో: కోల్డ్ ప్లే(Coldplay) కాన్సర్ట్ నిర్వాహకులకు అహ్మదాబాద్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అహ్మదాబాద్‌లోని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్(District Child Protection Unit in Ahmedabad).. సింగర్ క్రిస్ మార్టిన్(singer Chris Martin), కోల్డ్ ప్లే కాన్సర్ట్ నిర్వాహకులకు నోటీసులిచ్చింది. ప్రోగ్రాంలో స్టేజీపై పిల్లలను ఏ విధంగాను ఉపయోగించవద్దని హెచ్చరించింది. ఇయర్‌ప్లగ్‌లు లేదా హియరింగ్ ప్రొటెక్షన్ లేకుండా చిన్నారులను కాన్సర్ట్ కు అనుమతించవద్దని నిర్వాహకులను ఆదేశించింది. ప్రోగ్రాం టైంలో 120 డెసిబుల్స్ కంటే ఎక్కువ ధ్వని స్థాయిలు పిల్లల ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తాయని నోటీసులే పేర్కొంది. ఈ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చండీగఢ్ కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పండిత్ రావ్ ధర్నేవార్ చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ చేశారు. ఇకపోతే, బ్రిటన్‌కు చెందిన రాక్ బ్యాండ్ ప్రస్తుతం మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ వరల్డ్ టూర్‌లో భాగంగా భారత్ కు రానుంది. అహ్మదాబాద్, ముంబైలో కాన్సర్టులు నిర్వహిస్తోంది. జనవరి 25, 26 తేదీల్లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే అధికారులు కాన్సర్ట్ నిర్వహాకులకు నోటీసులు జారీ చేశారు.
గతంలోనూ
కాగా.. లూథియానాలో పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ న్యూ ఇయర్ ఈవ్ కాన్సర్ట్ పైనా గతంలో పండిత్ రావ్ ధర్నేవర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పంజాబ్ ప్రభుత్వ మహిళా శిశు విభాగం డిప్యూటీ డైరెక్టర్.. లూథియానా జిల్లా కమిషనర్‌కి అధికారిక నోటీసులు జారీ చేసింది. తన లైవ్ షోలో దిల్జీద్ మద్యానికి సంబంధించిన పాటలను ప్రదర్శించకుండా చూడాలని పేర్కొంది. కొన్ని పాటల లిరిక్స్ మార్చినప్పటికీ.. వాటిని పాడకుండా చూడాలని కోరింది.