కులాల మధ్య రిజర్వేషన్ చిచ్చు.. మాజీ సీఎం ఇంటిపై రాళ్ల దాడి!

త్వరలో ఎన్నికలు జరగాల్సిన కర్ణాటకలో కులాల మధ్య రిజర్వేషన్ చిచ్చు భగ్గుమంటోంది. జస్టిస్ ఏజే సదాశివ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేయవద్దంటూ ఇన్నాళ్లు శాంతియుతంగా

Update: 2023-03-27 11:37 GMT

 దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలో ఎన్నికలు జరగాల్సిన కర్ణాటకలో కులాల మధ్య రిజర్వేషన్ చిచ్చు భగ్గుమంటోంది. జస్టిస్ ఏజే సదాశివ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేయవద్దంటూ ఇన్నాళ్లు శాంతియుతంగా బంజారాలు చేపట్టిన ఉద్యమం సోమవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. శివమొగ్గలోని బీజేపీ మాజీ సీఎం, ఆ పార్టీ ముఖ్యనేత యడ్యురప్ప నివాసాన్ని ముట్టడించిన బంజారా కమ్యూనిటీ ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. యడ్యూరప్ప ఇంటిపై రాళ్లు రువ్వారు. ఆందోళన హింసాత్మకంగా మారుతుండటంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. కాగా సదాశివ కమిషన్ నివేదిక ప్రకారం షెడ్యూల్ కులాల్లోని ఉప కులాలకు జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతిలో ప్రాతినిధ్యం కల్పించాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధం అయింది. అయితే సదాశివ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని బంజారాలు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న బంజారాలు ఇవాళ తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు.

Tags:    

Similar News