PM Modi : 20 మంది సీనియర్ బ్యూరోక్రాట్లకు స్థానచలనం.. కేంద్రం కీలక నోటిఫికేషన్

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర క్యాబినెట్‌‌లోని వివిధ శాఖలకు సీనియర్ బ్యూరోక్రాట్ల నియామకంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

Update: 2024-08-16 17:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర క్యాబినెట్‌‌లోని వివిధ శాఖలకు సీనియర్ బ్యూరోక్రాట్ల నియామకంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇటీవలే కేంద్ర క్యాబినెట్ సెక్రెటరీగా టి.వి.సోమనాథన్, కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్ మోహన్‌లను నియమించిన ప్రభుత్వం.. ఇప్పుడు మరిన్ని శాఖలకు బ్యూరోక్రాట్ల నియామకంపై దృష్టిసారించింది. ఈక్రమంలోనే తాజాగా శుక్రవారం దాదాపు 20 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు మోడీ సర్కారు స్థానచలం కలిగింది. కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ ప్రకారం.. రక్షణ శాఖ తదుపరి కార్యదర్శిగా 1989 కేరళ బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాజేష్ కుమార్ సింగ్ బాధ్యతలు చేపడతారు. రక్షణశాఖకు చెందిన డిఫెన్స్ ప్రొడక్షన్ విభాగం నూతన కార్యదర్శిగా మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్‌ను కేంద్ర క్యాబినెట్ నియమించింది. కేంద్ర ఆర్థికశాఖ వ్యయ విభాగం తదుపరి కార్యదర్శిగా మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మనోజ్ గోవిల్ బాధ్యతలు స్వీకరిస్తారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యదర్శిగా దీప్తి ఉమాశంకర్

కేంద్ర ఆరోగ్యశాఖ తదుపరి కార్యదర్శిగా అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం కేంద్రపాలిత ప్రాంత ఐఏఎస్ క్యాడర్‌‌కు చెందిన పుణ్య సలీల శ్రియా వాస్తవ బాధ్యతలు చేపట్టనున్నారు. 1993 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన పుణ్య సలీల ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. హర్యానా క్యాడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి దీప్తి ఉమాశంకర్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తదుపరి కార్యదర్శిగా బాధ్యతలు చేపడతారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా దీప్తి గౌర్ ముఖర్జీ వ్యవహరించనున్నారు. మధ్యప్రదేశ్ క్యాడర్ 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన ఆమె ప్రస్తుతం నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓగా సేవలు అందిస్తున్నారు. కేంద్ర కల్చరల్ శాఖ కార్యదర్శిగా అరుణీష్ చావ్లాకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈయన 1992 బ్యాచ్ బిహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్ర కల్చరల్ శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న గోవింద్ మోహన్‌ ఈనెల 23న కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags:    

Similar News