దేశంలో పులుల సంఖ్యను అనౌన్స్ చేసిన ప్రధాని మోడీ
భారతదేశంలో 2022 నాటికి పులుల సంఖ్య 3,167గా ఉందని ప్రధాని మోడీ వెల్లడించారు. తాజాగా మోదీ విడుదల చేసిన నివేదిక ప్రకారం పులుల సంఖ్య
దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశంలో 2022 నాటికి పులుల సంఖ్య 3,167గా ఉందని ప్రధాని మోడీ వెల్లడించారు. తాజాగా మోదీ విడుదల చేసిన నివేదిక ప్రకారం పులుల సంఖ్య 2006లో 1,411, 2010లో 1,706, 2014లో 2,226, 2018లో 2,967, 2022లో 3,167కు చేరాయి. ‘ప్రాజెక్ట్ టైగర్’ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం కర్ణాటకలోని బండీపుర టైగర్ రిజర్వ్‌ను మోడీ సందర్శించారు. పులుల బండీపుర అభయారణ్యం- టైగర్ ప్రాజెక్టు సువర్ణ మహోత్సవాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలోనే 'ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్'ను కూడా ప్రారంభించారు. ఇది పులి, సింహం సహా ప్రపంచంలోని 7 పెద్దపెద్ద జంతువుల రక్షణపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. అనంతరం రాచనగరిలోని కర్ణాటక సార్వత్రిక విశ్వ విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే 25 ఏళ్లలో పులుల సంరక్షణకు సంబంధించిన విజన్‌ను అందజేస్తూ ‘అమృత్ కల్ కా టైగర్ విజన్’ బుక్‌లెట్‌ను కూడా విడుదల చేశారు.