దేశ రాజధాని ఢిల్లీలో డెంజర్‌గా మారిన కాలుష్యం, పొగమంచు
భారత రాజధాని ఢిల్లీలో కాలుష్యం రోజు రోజుకు ప్రమాద స్థాయికి చేరుకుంటుంది.
దిశ, వెబ్ డెస్క్: భారత రాజధాని ఢిల్లీ(Capital Delhi)లో వాయు కాలుష్యం(Air pollution) రోజు రోజుకు ప్రమాద స్థాయికి చేరుకుంటుంది. ఈ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అదుపు చేయలేక పోతున్నారు. దీంతో ఢిల్లీలో నివసించే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం(Severe impact on health) పడుతుందని విశ్లేషకులు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో శీతాకాలం ప్రారంభం కావడంతో ఈ కాలుష్య సమస్య మరింత పెరిగింది. ఢిల్లీకి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో పంటలను తగలబెడుతుండటంతో దట్టమైన పొగ(thick smoke) ఢిల్లీ నగరాన్ని కమ్మేస్తుంది. దీనికి తోడు చలికాలం కూడా రావడంతో.. రాజధాని ఢిల్లీలో కాలుష్యం, పొగమంచు(fog) తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో నగర రోడ్లపై విజిబిలిటీ 500 మీటర్లకు పడిపోయింది. ఈ కారణంగా.. వాయుకాలుష్యం సివియర్ ప్లస్ కేటగిరికి చేరుకుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు GRAP-4 చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయటకు రాకుండా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.