Pm modi: కులం పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్ర.. ప్రధాని మోడీ

కుల రాజకీయాల పేరుతో కొంత మంది శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.

Update: 2025-01-04 16:05 GMT

దిశ; నేషనల్ బ్యూరో: కుల రాజకీయాల పేరుతో కొంత మంది శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) ఆరోపించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో గ్రామీణ భారత్ మహోత్సవ్ (Grameen Bharat Mahotsav) 2025ను శనివారం ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచి గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారిస్తోందని, 2047 నాటికి వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలో గ్రామాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఇండియా కూటమి(India allaiance) నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘దేశంలోని కొందరు వ్యక్తులు కులం పేరుతో సమాజంలో విషాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలి. గ్రామాల ఉమ్మడి సంస్కృతి, వారసత్వాన్ని బలోపేతం చేయాలి’ అని వ్యాఖ్యానించారు. గ్రామాల్లోని సమస్యలను దగ్గరగా చూశాను. అందుకే వాటిని పరిష్కరించాలని కలలు కన్నానని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామాలను అభివృద్ధి, అవకాశాలకు శక్తిమంతమైన కేంద్రాలుగా మార్చడం ద్వారా గ్రామీణ భారతదేశాన్ని సాధికారత చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నొక్కిచెప్పారు.


Read More..

Amit Shah: మౌలిక సదుపాయాలకు బదులు ‘శీష్ మహల్’ నిర్మించారు.. కేజ్రీవాల్‌పై అమిత్ షా ఫైర్

Tags:    

Similar News