HMPV: భారతదేశంలో విజృంభిస్తోన్న HMPV వైరస్.. పెరుగుతోన్న కేసుల సంఖ్య
ఇటీవల చైనాలో వెలుగులోకి వచ్చిన హెచ్ఎంపీవీ వైరస్(HMPV Virus) భారత్(India) లో పంజా విసురుతోంది.
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల చైనాలో వెలుగులోకి వచ్చిన హెచ్ఎంపీవీ వైరస్(HMPV Virus) భారత్(India) లో పంజా విసురుతోంది. తీర ప్రాంత రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఉదయం 2 హెచ్ఎంపీవీ కేసులు(HMPV Cases) నమోదు కాగా.. ఆ కేసుల సంఖ్య సాయంత్రానికి 6 కు చేరింది. బెంగుళూరులో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్ ను గుర్తించామని చెప్పి, సదరు నమూనాలను మరోసారి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మరో నాలుగు కేసులు నమోదు అయ్యాయి.
దీంతో భారతదేశంలో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసులపై డబ్ల్యూహెచ్ఓ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ హెచ్ఎంపీవీ వైరస్ పై ఇప్పటికే చైనా అత్యవసర ఆరోగ్య ప్రకటించింది. ఈ వైరస్ ఇప్పుడు ఇండియాలో పెరుగుతుండటం పట్ల ఆరోగ్యశాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కాగా ఇప్పటికే ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైరస్ వ్యాపించకుండా తగిన మార్గదర్శకాలు పాటించాలని తెలిపింది.