PM Modi: కాంగ్రెస్ అనేది ఓ బాధ్యత లేని పార్టీ: ప్రధాని మోడీ

కాంగ్రెస్ అనేది ఓ బాధ్యత లేని పార్టీ అని, అధికారం కోసం హిందువులను విభజించి రాజకీయం చేయడమే ఆ పార్టీ ఉద్దేశమని ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2024-10-09 09:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అనేది ఓ బాధ్యత లేని పార్టీ అని, అధికారం కోసం హిందువులను విభజించి రాజకీయం చేయడమే ఆ పార్టీ ఉద్దేశమని ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ది విభజించు పాలించు విధానమని, అందుకే అధికారం దక్కించుకునేందుకు దేశాన్ని ఎలాగైనా విభజించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు (బుధవారం) మహరాష్ట్రలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింలపు భయపెట్టడమే కాంగ్రెస్ ఇన్నాళ్లుగా ఫాలో అవుతున్న ఫార్ములా అని, వాళ్లని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. అయితే హర్యానా ప్రజలు కాంగ్రెస్ విభజన విధానాలకు తలొగ్గమని, అర్బన్ నక్సల్స్ కుట్రల బారిన ఎప్పటికీ పడమని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తేల్చి చెప్పారని ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. 

Similar News