PM Kisan Yojana: రైతులకు భారీ గుడ్ న్యూస్.. నేడు అకౌంట్లలో రూ.2 వేలు జమ

రైతులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) మరో గుడ్‌న్యూస్ తెలిపింది.

Update: 2024-10-05 04:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) మరో గుడ్‌న్యూస్ తెలిపింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం (Pradhan Mantri Kisan Samman Yojana Scheme) కింద ఇవాళ రూ.20 వేల కోట్ల నిధులను విడుదల చేయనుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ కానున్నాయి. అదేవిధంగా నమో షెట్కారీ మహా సన్మాన్ నిధి యోజన కింద మహారాష్ట్ర రైతులకు అదనంగా మరో రూ.2 వేలు వారి ఖాతాల్లో అధికారులు జమ కానున్నాయి. కాగా, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఇది 18వ విడత కావడంతో రైతల ఖాతాల్లోకి జమ చేసే డబ్బు రూ.3.45 లక్షల కోట్లు దాటనుంది. దేశ వ్యాప్తంగా మొత్తం 11 కోట్ల మందికిపైగా అన్నదాతలు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు.

కాగా, ఫిబ్రవరి 24, 2019న కేంద్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతిని దృష్టి పెట్టుకుని పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా సేద్యం చేసే ప్రతి రైతుకు మూడు దశల్లో రూ.6 వేలు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. ఒక్కో దశలో భాగంగా రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పు జమ చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా రెండు ఎకరాలకు పైగా ఉన్న రైతులను పథకానికి అర్హులుగా గుర్తించారు.

జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి ఇలా..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితాలో లబ్ధిదారుల పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ https://pmkisan.gov.in/లోకి వెళ్లాలి. అక్కడ బెనిఫిషియరీ స్టేటస్ (Beneficiary Status) పేజీలోకి వెళ్లి.. బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేసి లబ్ధిదారుడి ఆధార్ (Aadhar) లేదా అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. లబ్ధిదారుడి రాష్ట్రం, జిల్లా, గ్రామం ఎంటర్ చేస్తే బెనిఫిషియరీ జాబితాలో పేరు ఉందో లేదో తెలిసిపోతుంది.  


Similar News