Haryana Elections: హర్యానా ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

హర్యానా(Haryana Assembly Elections)లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. హర్యాలోని 90 స్థానాలకు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అయ్యింది.

Update: 2024-10-05 05:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా(Haryana Assembly Elections)లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. హర్యాలోని 90 స్థానాలకు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇకపోతే, పలువురు ప్రముఖులు ఎన్నికల్లో తమ ఓటు హక్కి వినియోగించుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన షూటర్ మనుబాకర్ తొలిసారిగా ఎన్నికల్లో ఓటేసింది. చర్కి దాద్రీలోని పోలింగ్ స్టేషన్‌లో తన తండ్రి రామ్ కిషన్ బాకర్ తో కలిసి ఓటు వేసింది. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడింది. ఎన్నికల్లో ఓటు వేయడం వ్యక్తి బాధ్యత అని చెప్పుకొచ్చింది."ఈ దేశంలోని యువతగా అనుకూలమైన అభ్యర్థికి ఓటు వేయడం మన బాధ్యత. చిన్న అడుగులు పెద్ద లక్ష్యాలకు దారితీస్తాయి.. నేను మొదటిసారి ఓటు వేశాను.." అని మను బాకర్ తెలిపింది.

ఓటు వేసిన ప్రముఖులు

కర్నాల్‌లో కేంద్రమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. చర్కి దాద్రిలోని పోలింగ్‌ కేంద్రంలో మాజీ రెజ్లర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి వినేశ్‌ ఫొగాట్ (Vinesh Phogat) ఓటు వేశారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ కురుక్షేత్రలో ఓటేశారు. హర్యానా ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి నాయబ్‌ సింగ్‌ సైనీ అంబాలాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హర్యానాలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామంటూ ధీమా వ్యక్తంచేశారు. ఫరీదాబాద్‌లో కేంద్రమంత్రి కృషణ్‌ పాల్‌ గుర్జార్‌, సిర్సాలో మాజీ ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌటాలా ఓటుహక్కు వినియోగించుకున్నారు. భారత సంపన్న మహిళ, స్వతంత్ర అభ్యర్థి సావిత్రి జిందాల్‌ హిస్సార్‌లో ఓటు వేశారు.


Similar News