Deputy CMs : డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్! మధ్యలో చిరుని లాగుతున్న అనుచరులు

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య వివాదం ముదురుతోంది.

Update: 2024-10-05 06:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య వివాదం ముదురుతోంది. రెండు రాష్ట్రాల డిప్యూటీ సీఎంల మధ్య సనాతన ధర్మంపై మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. గురువారం తిరుమలకు కాలినడకన వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం పై మాట్లాడుతూ.. పరోక్షంగా ఉదయనిధి స్టాలిన్‌‌ను హెచ్చరించారు. సనాతన ధర్మం వైరల్ లాంటిదని దాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఉందని గతంలో ఉదయనిధి వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను తిరుపతిలో పవన్‌ కల్యాణ్‌ గుర్తు చేస్తూ.. ‘సనాతన ధర్మం అనేది ఒక వైరస్ దాన్ని నాశనం చేస్తానని ఒక యువనేత అంటున్నాడు‌‌‌‌.. నీలాంటోళ్ళు చాలామంది చరిత్ర లో వచ్చారు పోయారంటూ’ వ్యాఖ్యలు చేయడం దుమారం లేపింది.

ఈ క్రమంలోనే తమిళనాడులోని మదురైలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు అయింది. మతాలను రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారంటూ మదురై న్యాయవాది తాజాగా కేసు పెట్టారు. మరోవైపు పవన్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ఉదయనిధి స్టాలిన్ ‘లెట్స్ వెయిట్ అండ్ సీ’ అంటూ సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారం నెట్టింట చర్చానీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ టార్గెట్‌గా పాత వీడియోలను డీఎంకే పార్టీ సోషల్ మీడియా వింగ్ ట్రోల్స్ చేస్తోంది. పవన్ కు సపోర్ట్‌గా బీజేపీ, జనసేన వింగ్ కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే స్టాలిన్, పవన్ వివాదంలోకి నటుడు మెగాస్టార్ చిరంజీవిని ఉదయనిధి అనుచరులు లాగుతున్నారు. ‘మీ తమ్ముడు ఎమోషన్స్‌ను కంట్రోల్ ‌లో పెట్టుకోమని చెప్పండి’ అంటూ ఉదయనిధి అనుచరులు చిరును ట్యాగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం స్టాలిన్‌తో చిరు దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు.

 

Tags:    

Similar News