Rahul Gandhi: రాహుల్ గాంధీకి పూణే కోర్టు నోటీసులు.. ఆ రోజున విచారణకు హాజరు కావాలని ఆదేశాలు

వినాయక్ దామోదర్ సావర్కర్ (Vinayak Damodar Savarkar) మనవడు దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో పూణేలోని స్పెషల్ కోర్టు (Pune Special Court) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి నోటీసులు జారీ చేసింది.

Update: 2024-10-05 06:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: వినాయక్ దామోదర్ సావర్కర్ (Vinayak Damodar Savarkar) మనవడు దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో పూణేలోని స్పెషల్ కోర్టు (Pune Special Court) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి నోటీసులు జారీ చేసింది. Satyaki Savarkar, Pune Court , Notice , Congress MP Rahul Gandhi, Criminal Defamation Case, Latest Updates, Political Newsపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ కోర్టు ఆశ్రయించారు. ఈ మేరకు అక్టోబర్ 23న తమ ఎదుట హాజరుకావాలని కోరుతూ శుక్రవారం రాత్రి కోర్టు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి నోటీసులు జారీ చేసింది. గతేడాది సావర్కర్ మనవడు సాత్యకి సావర్కర్ (Satyaki Savarkar) పూణె కోర్టులో లోక్‌సభలో ప్రతిపక్ష నేతపై ఫిర్యాదు చేశారు. గత నెలలో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (ఎఫ్‌ఎంఎఫ్‌సీ) కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు ఈ కేసు బదిలీ అయింది.

జాయింట్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) అమోల్ షిండే (Amol Shinde) అధ్యక్షతన ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు గాంధీకి సమాధానం చెప్పేందుకు హాజరు కావాల్సిందేనని తెలుపుతూ.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి వ్యతిరేకంగా కోర్టు నోటీసులు జారీ చేసిందని సత్యకీ సావర్కర్ (Satyaki Savarkar) తరఫున న్యాయవాది సంగ్రామ్ కోల్హత్కర్ (Sangram Kolhatkar) తెలిపారు. భారతీయ శిక్షా స్మృతి (IPC)లోని సెక్షన్ 500 (పరువు నష్టం) కింద శిక్షార్హమైన అభియోగం రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై మోపబడిందని ఆయన పేర్కొన్నారు. కాగా, గాంధీ, మార్చి 2023లో లండన్‌ పర్యటన సందర్భంగా తన ప్రసంగంలో వినాయక్ దామోదర్ సావర్కర్ (Vinayak Damodar Savarkar) తనతో పాటు ఉన్న ఆరుగురు మిత్రులతో కలిసి ఓ ముస్లిం వ్యక్తిని కొట్టారని వ్యాఖ్యానించారు. అయితే, ప్రతి సందర్భంలోనూ సావర్కర్‌ను అవమాన పరిచేలా రాహుల్‌ విమర్శలు చేస్తున్నారని సాత్యకి ఆరోపించారు. దీంతో తమ కుటుంబ మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయని ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. 


Similar News