Pinarayi Vijayan: కేరళను పాకిస్థాన్ తో పోల్చిన మహారాష్ట్ర మంత్రి.. స్పందించిన పినరయి

వివాదాస్ప వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మంత్రి(Maharashtra Minister) నితీష్ రాణేపై కేరళ సీఎం(Kerala Chief Minister) పినరయి విజయన్(Pinarayi Vijayan) స్పందించారు.

Update: 2024-12-31 10:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వివాదాస్ప వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మంత్రి(Maharashtra Minister) నితీష్ రాణేపై కేరళ సీఎం(Kerala Chief Minister) పినరయి విజయన్(Pinarayi Vijayan) స్పందించారు. ‘‘కేరళ మినీ పాకిస్తాన్’’ అంటూ నితీష్ రాణే చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. రాణేవి రెచ్చగొట్టే వ్యాఖ్యలని వాటిని ఖండించారు. ఈ వ్యాఖ్యలు లౌకికవాదం, మతసామరస్యానికి పునాది అయిన కేరళకు వ్యతిరేకంగా సంఘ్ పరివార్ చేస్తున్న ద్వేషపూరిత ప్రచారమని విమర్శించారు. ఇది కేరళపై ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. ద్వేషపూరిత ప్రచారానికి వ్యతిరేకంగా అన్ని ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాణే రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశఆరు. అయితే, రాణే చేసిన రాజ్యాంగ ఉల్లంఘనపై కేంద్రం, లేదా బీజేపీ నాయకత్వం స్పందించకపోవడం ఆశ్చర్యం కల్గిస్తోందని అన్నారు.

మహారాష్ట్ర మంత్రి ఏమన్నారంటే?

మహారాష్ట్ర మంత్రి నితీస్ రాణే ఇటీవల ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలు మినీ పాకిస్థాన్ అయిన కేరళ వయనాడ్ నుంచి ఎన్నికయ్యారని అన్నారు. ‘‘కేరళ మినీ పాకిస్తాన్, అందుకే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడి నుంచి గెలుపొందారు. ఉగ్రవాదులంతా వారికి ఓటు వేస్తారు. ఇదే నిజం, ఉగ్రవాదులతో కలిసి ఉండే.. వారిద్దరూ ఎంపీలుగా మారారు’’ అని రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే, ఆ తర్వాత తన వ్యాఖ్యలపై రాణే వివరణ ఇచ్చారు. కేరళ, పాకిస్థాన్ మధ్య పోలికను చూపినట్లు పేర్కొన్నారు. 'పాకిస్థాన్‌లో హిందువులతో ఎలా ప్రవర్తిస్తారో.. అలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలానో అనే దానిపైనే స్పందించా. అలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనేదే నేను చెప్పలనుకున్నా' అని ఆయన వివరించారు.

Tags:    

Similar News