ప్రధాని మోదీకి 30 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాక్ మహిళ

భారతదేశంలో అన్నా చెల్లెళ్ల ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీకగా జరుపుకునేది రాఖీ పండగ.

Update: 2024-08-13 16:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశంలో అన్నా చెల్లెళ్ల ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీకగా జరుపుకునేది రాఖీ పండగ. భారత్ లోనే కాదు వివిధ దేశాల్లోని భారతీయులంతా ఈ పండగను ఇష్టంగా సెలెబ్రేట్ చేసుకుంటారు. అయితే ముస్లింలు ఎక్కువగా నివసించే పాకిస్థాన్ లోని ఓ మహిళ కూడా మన దేశ ప్రధానికి గత రెండు దశాబ్దాలుగా రాఖీ కడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ లోని కరాచీలో జన్మించిన ఖమర్ షేక్.. భారత్ కు చెందిన మొహిన్ షేక్ ను పెళ్లి చేసుకొని ఇక్కడికి వలస వచ్చారు. 1990లో తొలిసారి మోదీకి రాఖీ కట్టిన ఖమర్ ప్రతి ఏడాది కడుతూ వస్తున్నారు. తాజాగా 30వ ఏడాది కూడా మోదీకి రాఖీ కట్టేందుకు ఢిల్లీ వచ్చారు ఖమర్ షేక్. అయితే మోదీకి కట్టే రాఖిని ఖమర్ మార్కెట్లో కొనుగోలు చేయదు, ఆమె స్వయంగా తయారు చేసి, మోదీ చేతికి కట్టేంత వరకు ఎవరినీ ముట్టుకోనివ్వదు. ప్రతి ఏడాది తనకు రాఖీ కట్టేందుకు రావాలని మోదీ నుండి ప్రత్యేక ఆహ్వానం అందుతుందని తెలిపిన ఖమర్, భవిష్యత్ లో కూడా ఇలాంటి సంక్షేమ పాలన కొనసాగించాలని, దేశ ప్రజలంతా తన సోదరున్ని దీవించాలని ఆకాంక్షిస్తోంది.


Similar News