Waqf : వక్ఫ్ బిల్లుకు చాలా ముస్లిం సంస్థల మద్దతు : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని చాలా ముస్లిం సంస్థలు ఇప్పటికే ‘వక్ఫ్ సవరణ బిల్లు -2024’కు మద్దతును ప్రకటించాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.

Update: 2024-09-23 17:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని చాలా ముస్లిం సంస్థలు ఇప్పటికే ‘వక్ఫ్ సవరణ బిల్లు -2024’కు మద్దతును ప్రకటించాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. స్క్రూటినీ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీవీ) విడుదల చేసిన వక్ఫ్ బిల్లు ముసాయిదాపై పెద్ద సంఖ్యలో సూచనలు వచ్చాయన్నారు. ‘‘చాలా ముస్లిం సంస్థలు ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నాయి. అలాంటప్పుడు వక్ఫ్ బిల్లు అమల్లోకి వస్తే ముస్లింల భూములు కబ్జాల బారినపడతాయనే ప్రచారం చేయడం తగదు. ఆ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపేయాలి’’ అని కిరణ్ రిజిజు కోరారు.

వక్ఫ్ బోర్డులో పేద ముస్లిం మహిళలతో పాటు వెనుకబడిన ముస్లిం వర్గాలకు చోటు కల్పించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు. ప్రస్తుతం వక్ఫ్ భూముల దుర్వినియోగం జరుగుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో వక్ఫ్ భూముల వ్యవహారాల్లో అడ్డదిడ్డమైన నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు.


Similar News