పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు

పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏర్పాటు చేస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2024-08-16 14:18 GMT

దిశ, వెబ్ డెస్క్ : పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏర్పాటు చేస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. భారత పార్లమెంటులోని అతి ముఖ్యమైన కమిటీల్లో పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఒకటి. ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బు ఎంత మేరకు సమర్థవంతంగా వాడబడిందో ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీకి ప్రతిపక్ష సభ్యుల్లో నుండి ఒకరిని చైర్ పర్సన్ గా ఉంటారు. మిగతా సభ్యులు వివిధ పార్టీల నుండి ఎన్నుకోబడతారు. కాగా 2024-2025 కు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో పబ్లిక్ అకౌంట్ కమిటీ ఏర్పాటయింది. ఉభయ సభల నుండి మొత్తం 29 మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుండి బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు, జనసేన సభ్యుడు బాలశౌరి ఈ కమిటీలో సభ్యులుగా ఉండగా, రాజ్యసభ నుండి బీజేపీ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కు అవకాశం దక్కింది. ఈ కమిటీ వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటుంది. తర్వాత ఏడాది కోసం మరో సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.     


Similar News