Congress: మోడీ నిర్ణయాన్ని విమర్శించి మూర్ఖుడిలా మిగిలాను.. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ హాట్ కామెంట్స్

రాహుల్ గాంధీకి షాకిచ్చేలా కాంగ్రెస్ సీనియర్ ఎంపీ హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2025-03-19 04:58 GMT
Congress:  మోడీ నిర్ణయాన్ని విమర్శించి మూర్ఖుడిలా మిగిలాను.. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ హాట్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. గత కొంత కాలంగా ఆయన కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్ణయాలను, ప్రధాని నరేంద్రమోడీపై (Narendra Modi) ప్రశంసలు కురిపించడం దుమారం రేపుతున్నది. తాజాగా మరోసారి ఆయన ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని ప్రశంసించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) మొదలైన సమయంలో భారత్ వైఖరిని విమర్శించడం ద్వారా తానొక మూర్ఖుడిగా మిగిలానని హాట్ కామెంట్స్ చేశారు. ఈ యుద్ధం మొదలైన సమయంలో భారత్ ఒక స్టాండ్ తీసుకోలేదని తాను విమర్శించానని కానీ భారత ప్రధాని రెండు వారాల వ్యవధిలో ఆ రెండు దేశాల అధినేతలను ఆలింగనం చేసుకుని వారి ఆమోదం పొందారన్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో శశిథరూర్ మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా తక్కువ దేశాలకు సాధఅయమయ్యే, శాశ్వత శాంతి తీసుకువచ్చే స్థితిలో భారత్ ఉందని యూరప్ వ్యవహారాల్లో ఎక్కువ జోక్యం చేసుకోపోవడం వల్ల ఇండియా అనేక ప్రయోజనాలు పొందుతున్నదని వెల్లడించారు.

కాంగ్రెస్, థరూర్ మధ్య గ్యాప్!

శశిథరూర్ ఇటీవల చేస్తున్న కామెంట్స్ కాంగ్రెస్ (Congress) పార్టీలో రచ్చగా మారుతున్నాయి. దీంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీకి మధ్య విభేదాలు ఉన్నాయని త్వరలోనే ఆయన పార్టీ వీడుతారనే టాక్ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇటీవల ఓ ఆర్టికల్ లో కేరళ ప్రభుత్వ విధానాలను ప్రశంసించడం, ప్రధాన మంత్రి అమెరికా పర్యటన సైతం ప్రశంసలు కురిపించడంపై కాంగ్రెస్ గుర్రుమంటోందనే ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల నాటికి పార్టీని మరింత స్ట్రాంగ్ చేయాలని చూస్తున్నారు. సొంత పార్టీలో బీజేపీ కోవర్టులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మోడీ నిర్ణయానికి థరూర్ జై కొట్టడం హస్తం పార్టీలో ఏం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

Read More..

నడవలేని స్థితిలో సునీతా విలియమ్స్ (వీడియో) 

Tags:    

Similar News