Breaking: అసెంబ్లీలో ఉద్రిక్తత.. 18 మంది ఎమ్మెల్యేలు సస్పెన్షన్
కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం నెలకొంది...

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ(Karnataka Assembly)లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల(Muslim reservations)ను వ్యతిరేకిస్తూ బీజేపీ(Bjp) ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం(Speaker Podium) వెల్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. పోడియాన్ని చుట్టిముట్టి నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ ఎంత వారించినా ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు. దీంతో 18 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామంతో అసెంబ్లీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ మార్షల్ బయటకు పంపేశారు. దీంతో ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ప్రభుత్వ విధానాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
కాగా హనీట్రాప్(Hony Trap) వ్యవహారంపైనా అంతకుముందు అసెంబ్లీ దద్దరిల్లింది. మంత్రులు సహా చాలా మంది అధికార పార్టీ నేతలపై ఆరోపణలు ఉండటంతో సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారు. అయితే కేసు నమోదై దర్యాప్తు ప్రారంభం అయితే హానీ ట్రాప్ లో ఎవరి ప్రమేయం ఉన్నా కఠిన చర్యలు తప్పవని సీఎం సిద్ధరామయ్య(Cm Siddaramaiah) హెచ్చరించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనను విరమించారు.