ఆలోపే మావోయిస్టులందరినీ ఏరివేస్తాం.. అమిత్‌షా సంచలన ప్రకటన
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన రాజ్యసభ(Rajya Sabha)లో మాట్లాడుతూ.. 2026 మార్చి 31వ తేదీ నాటికి మావోయిస్టులు(Maoists) అందరినీ ఏరివేస్తామని కీలక ప్రకటన చేశారు. నక్సలిజం పొలిటికల్ సమస్య కాదని అన్నారు. పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు రెడ్ కారిడార్(Red Corridor) ఉందని చెప్పారు. ఇటీవలే మావోయిస్టుల నెట్‌వర్క్(Maoist Network)ను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఇప్పుడు కేవలం 12 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉన్నాయని అన్నారు. మావోయిస్టుల ఏరివేతలో సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాల పనితీరు అద్భుతంగా ఉందని రాజ్యసభలో అమిత్ షా కొనియాడారు. కాగా, ఇటీవలే మావోయిస్టుల ఏరివేతపై అమిత్ షా సోషల్ మీడియాలోనూ ఆసక్తికర ట్వీట్ పెట్టారు.
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనపై స్పందించారు. భారత్‌ను నక్సల్ రహిత దేశంగా మార్చేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో ఇది మరో పెద్ద విజయమని అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోందని చెప్పారు. అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నా.. కొందరు మావోయిస్టులు లొంగిపోవడం లేదు.. కేవలం అలాంటి వారి పట్లనే మోడీ సర్కార్(Modi Government) కఠినంగా ఉందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కాగా.. ఒకే రోజు రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇటీవల 22 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.