Amit Shah- Omar Abdullah: జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరించనున్న కేంద్రం!

జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇటీవలే జమ్ముకశ్మీర్ లో ప్రభుత్వం కొలువుదీరింది.

Update: 2024-10-24 09:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇటీవలే జమ్ముకశ్మీర్ లో ప్రభుత్వం కొలువుదీరింది. ఇలాంటి టైంలో, ఇరువురి భేటీ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలనే అంశంపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఈమేరకు కథనాలు వచ్చాయి. ఇటీవల సీఎం ఒమర్‌ అబ్దుల్లా జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, ఆ విషయమై చర్చించేందుకు బుధవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి కేంద్రం మద్దతు తెలపడంతో పాటు, రాష్ట్ర హోదా పునరుద్ధరణపై కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.

మోడీతో భేటీ..!

మరోవైపు సీఎం ఒమర్‌ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తీర్మానప్రతిని అందజేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. దాదాపు పదేళఅల తర్వాత జమ్మూకశ్మీర్‌ లో ఎన్నికలు జరిగాయి. కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత తొలిసారి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్‌సీ- కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించగా.. ఒమర్‌ అబ్దుల్లా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాతే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేబినెట్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సైతం ఆమోదించారు.


Similar News