పెంపుడు కుక్కకు శ్రీమంతం..వైరల్ గా వీడియో

సమాజంలో మనుషుల మధ్య అనుబంధాల భావన తరిగిపోతున్న కాలంలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు సంప్రదాయంగా ఘనంగా శ్రీమంతం చేసి తన గొప్ప మనసును, జంతుప్రేమను చాటుకున్నాడు.

Update: 2024-10-24 10:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : సమాజంలో మనుషుల మధ్య అనుబంధాల భావన తరిగిపోతున్న కాలంలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు సంప్రదాయంగా ఘనంగా శ్రీమంతం చేసి తన గొప్ప మనసును, జంతుప్రేమను చాటుకున్నాడు. పెంపుడు కుక్క కోసం శ్రీమంతం నిర్వహించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తమినాడులోని కడలూరులోని తంపిపేట్ పాళయం ప్రాంతానికి చెందిన శివ అనే వ్యక్తి తన ఇంట్లో ఏడాదికి పైగా కరువాచి అనే పెంపుడు కుక్కను పెంచుకుంటున్నాడు. ఆ కుక్క గర్భం దాల్చడంతో దానిపై ఉన్న అభిమానంతో శ్రీమంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇరుగు పొరుగు ఊరు వాడలోని అమ్మలక్కలను పిలిచి సంప్రదాయంగా శ్రీమంతం వేడుక జరిపించాడు.

గర్భిణీ మహిళలకు ఏ రకంగానైతే బంధువులు, అమ్మలక్కలు గాజులు, సారే గంప, పండ్లను తీసుకొచ్చి శ్రీమంతం చేసినట్లుగానే అదే తరహాలో అంతా కలసి పండ్లు, స్వీట్లు, గాజులు తీసుకొచ్చి పెంపుడు కుక్కకు కొత్త చీరను కట్టి కుర్చిలో కూర్చోబెట్టి, బొట్టుపెట్టి బంగారు గొలుసు, పూల దండ మెడలో వేసి శ్రీమంతం వేడుక నిర్వహించారు. ఫోటోలు, వీడియోలు కూడా తీయించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Similar News