అధికార కాంగ్రెస్‌కు షాక్.. శాసనమండలి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఘన విజయం

కర్ణాటక అసెంబ్లీకి 2023 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-10-24 11:55 GMT

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీకి 2023 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్(congress) పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది. మొత్తం 28 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయగా.. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ(BJP) పార్టీ 17 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. ఇది మరువక ముందే అధికార కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ కన్నడ, ఉడిపి లోకల్ అథారిటీస్ నియోజకవర్గాల నుంచి కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్‌(Karnataka Legislative Council)కు గురువారం జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కిషోర్ కుమార్ పుత్తూరు(Kishore Kumar Puttur) విజయం సాధించారు. దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గంలో 97.91% ఓటింగ్ నమోదైంది.

ఇందులో మొత్తం 6,032 మంది ఓటర్లకు గాను 5,906 మంది ఓటు వేశారు. బీజేపీ నేత కోట శ్రీనివాస్ పూజారి ఉడిపి-చిక్కమగళూరు నియోజకవర్గం ఎంపీగా ఎన్నికైన తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైంది. కిషోర్‌తో పాటు కాంగ్రెస్‌ నుంచి రాజు పూజారి, ఎస్‌డిపిఐకి చెందిన అన్వర్‌ సాదత్‌, స్వతంత్ర అభ్యర్థి దినకర్‌ ఉల్లాల్‌ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఓటర్లలో గ్రామ పంచాయతీ సభ్యులు, మంగళూరు నగర కార్పొరేషన్ కార్పొరేటర్లు, నగర పురపాలక సంఘం సభ్యులు, పట్టణ మునిసిపల్ కౌన్సిల్‌లు, పట్టణ పంచాయతీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలకు చెందిన లోక్‌సభ సభ్యులతో సహా ఓటర్లుగా ఉంటారు.

Tags:    

Similar News